ఓ భిన్న దృశ్యం!
మరో
తప్పనిసరి త్రిశంకు స్వర్గ ప్రదర్శనకై
అసహనంగా
మస్తిష్కపు నగారా
నిద్ర లేస్తున్న
దృశ్యం
తెలతెల
వారుతున్న ఉదయపు
లేత
బూడిద రంగును దులుపుకుంటూ
అనకొండ
చర్మపు పొలుసుల్లా
చేదెక్కుతున్న
పెదవులతో
యాంత్రిక
జీవాలు సాగుతున్న దృశ్యం
కాలనేమి
కనికట్టు దుకాణంలో
కాలం
కలలా కరిగి
క్షణాలై
ప్రవహించే పగటి దృశ్యం
పగలంతా
రాట్నం తిప్పిన నగరం
రంగుల
వెలుగుల్లో
నాట్యమాడేందుకు
ముస్తాబయే
మనోహర
సాయంకాల దృశ్యం
దేహం
కాసై కరిగేందుకు
జ్వాలాతోరణం
చుట్టుకుంటున్న దృశ్యం
చిన్ని
ముద్దంత ఆప్యాయతకై
ఆశగా
యెదురుచూసే
పసిహృదయాలను,
ఆలంబనను
కోరే సహచరత్వాన్ని
నిస్సహాయంగా
ఛీత్కరించుకుంటూ
సాగిలపడే
ఓ
మధ్య తరగతి సాయంత్రపు
అకాల
వృద్ధాప్యపు దృశ్యం
కాలుష్యపు
మత్తులో జోగి
హద్దులు
దాటిన నగరపుటంచుల్లో
తాంత్రిక
పాతాళభైరవి సాక్షిగా
మార్జాలగతుల్లో,విలాసనృత్యాల్లో,
పరదేశీ
రాగం విశృంఖలత్వాన్ని
స్ఖలిస్తున్న
దృశ్యం
సంస్కృతీ
వారసులు
జంటనగరాల
జుగల్బందీల్లో
నిస్సహాయపుటాక్రందనల
ముషాయిరాల్లో,
శిల్పతారకలై,
తథాగతుని సాక్షిగా,
చెరువు
గట్టున తరిస్తున్న దృశ్యం
నెత్తుటిరుచికై
నిద్రనటిస్తున్న
పంజా
రాత్రిదారులకై
కనులు
తెరుస్తున్న దృశ్యం
మరో
తప్పనిసరి ఉదయానికై
తడిసినకట్టెలా
ఆరి
రాజుకునే నగరం
ఓ
నిత్య భీభత్స దృశ్యం
-విజయ బాబు,కోగంటి
(Published in Navya,
Telugu weekly17th Dec 2008)
No comments:
Post a Comment