Saturday, September 10, 2016

‘నాహం త్వమేవ’

‘నాహం త్వమేవ’

డా. విజయ బాబు, కోగంటి
నీకువలె నా లోనూ
నిశ్శబ్దంగా విచ్చుకునే సుమ స్వప్నాలున్నై.
నీలో సప్తవర్ణాలుసజీవ శుకపిక ధ్వానాలు!
నాలో లెక్కకు అందని రంగులు,
అనుక్షణం ఆరి మెరిసే అందని ఆశల మిణుగురులు!
నీలో గభీర సంగీత నాదాలు!
నావి నిరంతర కల్లోలిత నిస్పృహా నిస్సహాయతల
నిట్టూర్పులు,
నిబిడానలపు టుసూరు చిటపటలు!
నీకు మాటి మాటికీ
వసంత రాగాలుగ్రీష్మాసవాలు,
వర్షస్నానాలుశరచ్చంద్రికలు,
హేమంత శిశిరాల దాగుడుమూతలు,
రంగురంగుల ఆకుల దుశ్శాలువలు,
పూల కౌగిళ్ళు!
మరి నావోకోరికల మృగతృష్ణలు,
నిత్య గ్రీష్మాలు,కామోద్రేక వర్షాలు,
పశ్చాత్తాపాల వరద వెల్లువలు,
అడియాసల శిశిరాలు.
నీకు ఎటుచూసినా షడృతువులే
మరి నాకోనీ ఊహకే అందని చిత్ర ఋతుహేల!
కామం తో మొదలై మాత్సర్యం దాకా!
ఇవికూడా ఎపుడంటే అపుడేవరసా వావీ లేకుండానాకే తెలియ కుండా!
నీవు సృష్టి కూడా తెలిసిన  ప్రకృతివి మాత్రమే,
నేను వికృతినిమనిషిని,
నవ్వే తోడెలునునవ్వలేని రాబందును కూడా.
అండజబిడజ తిర్యకులన్నీ నీలో విడివిడిగా నైతే
అన్నీ నాలో కలివిడిగా!
నేను అరాచకాన్నిఅవకాశవాదాన్ని కూడా!
నేనో భయచరాన్నిఅభయ చరాన్ని,
అర్ధం మారిన ఉభయ చరాన్ని కూడా!
అందుకేనా2హం త్వమేవ!
koganti
 *