Thursday, December 20, 2012
Wednesday, December 5, 2012
Endukilaa?
పొద్దు తిరుగుడు పువ్వై
కాలం పలకరిస్తూనే వుంది.
వాన చినుకైనా, గాలి తెమ్మెరైనా
ఏ అవసరమూ లేకున్నా ముద్దాడి
కౌగలించుకు పోతూనే వున్నై.
ముక్కూ మొగం తెలీని పసిపాప కూడా
చిరునవ్వుకే
వెన్నెల కుమ్మరిస్తోంది.
తోడుగానే పుట్టీ, పెరిగి ,
నేస్తమంటూ జతకట్టిన వాడో, అదో మాత్రం
అవసరమొస్తే గానీ కనిపించరు,పలకరించరు!
కరగని ఙ్ఞాపకాలు మాత్రం
గుండె నీడన
పున్నాగలై రాలుతూ
జీవిత క్షణాలు లెక్క పెడుతూనే వున్నాయి.
Vijaya Babu,Koganti
koviba@gmail.com
8801823244
Subscribe to:
Comments (Atom)