Sunday, September 8, 2013

the sun

comes out of the night’s blanket,
like a shepherd, to make
the darks hide in the green pastures of the world.
నిర్ణయం నీదే!

గమనించావా?
జీవితం ఒక ఆగని పాటై, సెలయేరై,
కలవరపెట్టే సుడిగాలై పాడుతూనే ఉంటుంది.

చిటపటలు,విసుర్లు,ఆనందోత్సవాల
ఆశా నిరాశల కలవరపాటులు మాత్రమే మనవి.

వింటూనే ఉండు.
ఒక నాటికి సత్యం గోచరించకపోదు.
అర్ధం కాని బొమ్మల్ని మోసే కాగితపు చిత్రంలా
జీవితం మనకగుపించినా,
తాను మాత్రం సహజత్వం కోల్పోని జీవనది!
తనపాట మాత్రం ఆగదు. తానొక నిరంతర వాహిని.

అందుకుని ఆనంద పడ గలవా?
పరిమళించే రహస్యం తెలుసుకుంటావ్!

లేదా మెరుపుకో, ఉరుముకో వణికిపోయే
చివురు టాకులా మాత్రమే మిగిలి పోతావ్.

విజయ బాబు,కోగంటి
koviba@gmail.com
8801823244

-