Friday, October 9, 2015

ప్రశ్నలు

ప్రశ్నలు!

ఈ పరుగు ప౦దాల ను౦డి కాసి౦తవిరామ౦ ప్రకటి౦చుదామా?
మనవారి ముఖాల్ని రవ౦త చూద్దామా!

భృకుటి ముడిలో బిగి౦చిన గా౦భీర్యాన్నీ
క౦టిరెప్పల క్రి౦ద బ౦ధి౦చిన బాధల సాగరాలను
మూలాలతో సహా తొలగిద్దామా?

రవంత వూపిరి పీలుద్దామా!
ఎ౦డే గు౦డె చాళ్ళను,
మాటల సెలయేళ్ళను మళ్ళి౦చి
నవ్వుల ప౦టలు ప౦డిద్దామా?
మనుషులమేనని గుర్తిద్దామా!

మనసును మరబొమ్మను చేసి మూగబుచ్చిన
యీ గారడీ పలకలను మూసేద్దామా!

మనుషులను మనుషులుగా చూసి
మనసు కురిసే మాటల వర్షాన తడిసి
ఎన్నాళ్ళయి౦ది చెప్పు!

ఈ పరుగు ప౦దాల ను౦డి కాసి౦తవిరామ౦ ప్రకటి౦చుదామా?

July 19th 3.45 pm

Shall We?

Shall We?

Shall we give a break to this race of life?

Shall we stop a while to see our own people and their eyes with innumerable stories?

Shall we try to erase that knot of seriousness from their frozen foreheads                                              and those swirling oceans of pain caught between the eyelids?

Shall we stop a while and take a breath of fresh air?

Shall we take those brooks of words through the dried furrows of hearts and reap the harvest of smiles?

Shall we try to know that we are humans at least!
Shall we close all these magical tabs that made our hearts silent robots?

Wasn't that long ago we saw humans as humans and                                                           got drenched in the showers of heart's whisperings?

Shall we give a break to this race of life?

Shall we?
***
July 19th 4 PM

Thursday, October 8, 2015

ఓ మాటడగనా?
అలా, నింగి నేలను తాకిందాకా
నడుస్తూ వెళ్ళి వద్దాం వస్తావా?
ఒకోసారి గుండె అరల్లో దాచుకున్న
నవ్వుల తేనె పట్టునో
కన్నీటి తెరలనో
అందరిముందూ విప్పలేం కదా?
అందుకే అలా పంచుకుంటూ
కాలంతో పాటు కరుగుతూ
వెళ్ళి వద్దాం, వస్తావా?
నడక శరీరానికి మంచిదే,
కానీ నీతో నడక
మనసుకూ మంచిదనిపిస్తోంది.
ప్రతి అడుగులోనూ
ఒక్కో ఙ్ఞాపకాన్నీ
వెనక్కు తోసేస్తూ
గుండెను తేలిక పరుస్తూ
నడుద్దాం, వస్తావా!
చాలా ఉక్కగా ఉన్న
ఈ మనసు గోడల బయటికి,
సాయంత్రపు గాలిలో
సంతోషపు చివురు తొడిగిందాకా,
అలా నడుస్తూ,అక్కడ
నింగిని నేల కలిసే భ్రమను చీల్చిందాకా
నడుద్దాం, వస్తావా!?
- డా. కోగంటి విజయబాబు

Can we?

Can we?
I always love to say
'We need it,
We should,
and We will...'
But listening to all my inclusive talk
you again love to say
or may be unconsciously,
'I will, I know and I...'
Let Us not be singular,
But plural in expression;
but try to be togetherly
Singular in existence!

యిలా, యీ వుదయాన ...

యిలా, యీ వుదయాన ...
**
అపురూపంగా యేరి దాచుకున్న
కొన్ని గవ్వలెక్కడో పోయాయి
యీ మనసు వడ్డునే
నడుస్తూ అడుగడుగునా వెదుకుతున్నా 
యీ నిరంతర సాగర తరంగాల హోరు
నా వంటరి తనాన్ని మరింత గుర్తు చేస్తోంది
యీ అనిశ్చిత వేదనకు మూలమైన రహస్యాన్ని
ఛేదించే మంత్రమూ
వాటిలోనే దాగుంది
ప్రతి వూపిరి తోనూ
ఒక్కొకటిగా దాచిన గవ్వలవి
దొరుకుతాయనే ఆశతోనే శోధిస్తూ
యిలా, యీ వుదయాన ...