ఓహ్ సమ్మర్!
"సంవత్సరానికోమారేగా
నేను!" -
వాడిగా,వేడిగా యెండ.
యెండిన చెట్లతో,
దిక్కులేక వీధుల్లో
వెర్రిగా కేకలేస్తూ
పరిగెడుతున్న వడగాలి!
యెర్ర సూర్యుడి కౌగిట్లో
ఉడుకెత్తిన నేల
ఓ విరిసిన దిరిసెన పువ్వు!
అందరినెత్తినా టోపీలు పెడుతూ
నవ్వుతున్నాడు
వికట సూర్యుడు.
"ఇన్నాళ్ళకు మళ్ళీ గుర్తొస్తాం"-
ఎయిర్ కూలర్ల గుర గుర!
చెరువుల్లో, బావుల్లో,
"కుండ" కోనల్లో
చల్లగా దాహపు ఈదులాట!
"పిందెలతో వచ్చిన గ్రీష్మం
పండిందాకా తోడుండి పోయింది"
-
ఓ మామిడిచెట్టు సంబరం!
పరీక్షలూ, క్రికెట్ మ్యాచ్
లూ,
"గుళ్ళూ", గోపురాలూ,
పిల్లల కేరింతలూ,పెద్దల విసుర్లూ,
చలివేంద్రాలూ, కరంట్ కట్లూ,
చెరుకు రసాలూ, మల్లెలూ, మామిళ్ళూ,
ఓహ్, సమ్మర్!
-విజయ బాబు,కోగంటి
(Published in Saakshi,
Funday,, Daily on 1st June 2008)
No comments:
Post a Comment