Thursday, October 8, 2015

యిలా, యీ వుదయాన ...

యిలా, యీ వుదయాన ...
**
అపురూపంగా యేరి దాచుకున్న
కొన్ని గవ్వలెక్కడో పోయాయి
యీ మనసు వడ్డునే
నడుస్తూ అడుగడుగునా వెదుకుతున్నా 
యీ నిరంతర సాగర తరంగాల హోరు
నా వంటరి తనాన్ని మరింత గుర్తు చేస్తోంది
యీ అనిశ్చిత వేదనకు మూలమైన రహస్యాన్ని
ఛేదించే మంత్రమూ
వాటిలోనే దాగుంది
ప్రతి వూపిరి తోనూ
ఒక్కొకటిగా దాచిన గవ్వలవి
దొరుకుతాయనే ఆశతోనే శోధిస్తూ
యిలా, యీ వుదయాన ...

1 comment: